: జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియకు హైకోర్టు బ్రేక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్) ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఎలాంటి చర్యలు చేపట్టవద్దని జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఇళ్ల క్రమబద్ధీకరణ చేయడం అక్రమార్కులను ప్రోత్సహించినట్టేనని, వారిని చట్టం ముందు నిలబెట్టాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈరోజు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తరువాత చేపడతామని న్యాయస్థానం తెలిపింది.