: శేషాచలం అడవుల్లో కూంబింగ్... రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం


చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంద్యాలకోన వద్ద అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా అటవీశాఖ అధికారులకు 80 మంది కూలీలు ఎదురుపడ్డారు. ఈ సమయంలో అధికారులపై రాళ్లతో దాడిచేసి ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. తరువాత ఘటనా స్థలంలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఓ కూలీ కూడా పోలీసులకు దొరికిపోయాడు. ఆ దుంగల విలువ రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

  • Loading...

More Telugu News