: బ్యాంక్ దోపిడీ కేసులో నిర్మాత బాలమురుగన్ అరెస్ట్
ఘట్ కేసర్ లో జరిగిన బ్యాంక్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు బాలమురుగన్ సహా ముగ్గురుని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 1.72 కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. బాలమురుగన్ ప్రొడక్షన్ పేరుతో బాలమురుగన్ సినిమాలు నిర్మిస్తున్నారు. మానస వినయ, ఆత్మ సినిమాలకు పెట్టుబడి పెట్టారు. అంతేకాకుండా, సౌతిండియా ఫిల్మ్ గిల్డ్ లో బాలమురుగన్ కు మెంబర్ షిప్ కూడా ఉంది.