: మల్లాది విష్ణు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా


విజయవాడ నకిలీ మద్యం కేసులో కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో, తాము మరికొన్ని పత్రాలు కోర్టుకు సమర్పించాల్సి ఉందని, కొంత సమయం కావాలని విష్ణు తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని పత్రాలు ఇచ్చారని, మళ్లీ పేపర్లు ఏంటని ప్రశ్నించారు. కానీ, వారికి ఓ అవకాశం ఇద్దామని చెప్పిన న్యాయమూర్తి అందుకు అనుమతిచ్చారు. ఈ నెల 28కి తదుపరి విచారణను వాయిదా వేశారు. మరోవైపు విష్ణు కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయన షిరిడీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News