: వైసీఎల్పీ సమావేశం ప్రారంభం... రోజాపై సస్పెన్షన్ పైనే ప్రధాన చర్చ?


ఏపీ అసెంబ్లీలో విపక్ష వైసీపీ శాసనసభా పక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ దాదాపుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై సర్కారు విధించిన ఏడాది సస్పెన్షన్ పైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రోజాపై సస్పెన్షన్ నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ పై ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు రానుంది.

  • Loading...

More Telugu News