: త్వరలో అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకం ప్రారంభిస్తాం: హైకోర్టుకు తెలిపిన ఏపీ సీఐడీ


అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. దర్యాప్తు స్థాయి నివేదికను ఏపీ సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. నివేదికను పరిశీలించిన కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణలో భాగంగా ఆస్తుల అమ్మకాలపై కోర్టు ప్రశ్నించగా.... 2, 3 రోజుల్లోగా ఆస్తుల అమ్మకాల వేలాన్ని ఖరారు చేస్తామని సీఐడీ తెలిపింది. ఇప్పటికే ప్రకటించిన ఎంఎస్ సీసీ కంపెనీతో పాటు మరో రెండు కంపెనీలకు కూడా ఆస్తుల అమ్మకాన్ని అప్పగిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News