: మండలిలో వింత... అధికారపక్ష సభ్యుల నిరసనతో వాయిదాపడ్డ సభ
ఎక్కడైనా అధికార పార్టీ సభ్యుల వాదనను తిప్పికొట్టే క్రమంలో విపక్ష సభ్యులు చట్టసభలను అడ్డుకుంటారు. కానీ, అధికార పక్ష సభ్యుల ఆందోళనలతోనే సభ వాయిదా పడితే... వింత కాకపోతే మరేంటి? ఈ తరహా వింత పోకడ ఏపీ శాసనమండలి శీతాకాల సమావేశాల చివరి రోజైన నేడు కొద్దిసేపటి క్రితం చోటుచేసుకుంది. సభలో టీడీపీ సభ్యులు గోల పెట్టడంతో మండలి చైర్మన్ చక్రపాణి సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అయినా, అధికార పక్ష సభ్యుల ఆందోళనకు కారణమేంటో తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ప్రొటోకాల్ ను పాటించకపోవడమేనట!