: ‘పీతల’ ఇలాకాకు మహర్దశ... ‘నల్ల బంగారం’ వెలికితీతకు సర్కారు చర్యలు


టీడీపీ మహిళా నేత, ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడికి మహర్దశ రానుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ ఎత్తున బొగ్గు నిక్షేపాలున్నాయని ఇప్పటికే తేటతెల్లమైంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుల్లో వెలుగుచూసిన ఈ నిక్షేపాలు తెలంగాణ పరిధిలోని సింగరేణి నిక్షేపాల స్థాయి కంటే వందల రెట్లు ఎక్కువున్నాయన్న వార్తలతో ఏపీ సర్కారు ఆ దిశగా దృష్టి సారించింది. అంతేకాక ఇప్పటికే సదరు నిక్షేపాలపై సర్వే చేయించిన ప్రభుత్వం తొలి విడతగా పీతల సుజాత సొంత నియోజకవర్గం చింతలపూడిలో తొలుత బొగ్గు వెలికితీతను ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పీతల సుజాత ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఒక్కసారి బొగ్గు వెలికితీత మొదలలైతే తన నియోజకవర్గం రూపురేఖలే మారిపోనున్నాయని ఆమె భావిస్తున్నారు. లెక్కలేనన్ని ఉపాధి అవకాశాలతో నియోజకవర్గంలో నిరుద్యోగానికి చెక్ పెట్టడమే కాక పారిశ్రామికంగా చింతలపూడి పరుగులు పెడుతుందని ఆమె సన్నిహితులు లెక్కలేస్తున్నారు.

  • Loading...

More Telugu News