: ఢిల్లీలో కూలిన బీఎస్ఎఫ్ విమానం... ఇద్దరు మృతి
ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బీఎస్ఎఫ్ కు చెందిన సూపర్ కింగ్ విమానం ఈ ఉదయం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని సమాచారం అందుతోంది. సాంకేతిక నిపుణులను రాంచీ తీసుకెళుతుండగా సాంకేతిక లోపం కారణంగా విమాన ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోగా, 15 ఫైరింజన్లు మంటలార్పుతున్నాయి. విమానంలో మొత్తం 12 మంది బీఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారని తెలిసింది. మరోవైపు ఘటనలో ఎంతమంది చనిపోయారన్న విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది.