: దూసుకెళుతున్న సానియా... కేశ్ కింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ స్టార్
హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మైదానంలోనే కాక ధనార్జనలోనూ దూసుకెళుతోంది. ఇప్పటికే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న ఆమె పలు వాణిజ్య ఉత్పత్తులకు కూడా ప్రచారకర్తగా వ్యవహరిస్తూ రెండు చేతులా ఆర్జిస్తోంది. హెయిర్ ఆయిల్ కేటగిరీలో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కేశ్ కింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గానూ ఆమె వ్యహరించనుంది. ఈ మేరకు ఇమామి లిమిటెడ్ కంపెనీతో సానియా నిన్న ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే కేశ్ కింగ్ బ్రాండ్ ను ఇమామీ లిమిటెడ్ చేజిక్కించుకుంది. ఇప్పటికే కేశ్ కింగ్ కు సినీ నటీమణులు జూహీ చావ్లా, శృతి హాసన్ లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా సానియా కూడా తమ ఉత్పత్తికి ప్రచారం చేస్తారని ఇమామీ లిమిటెడ్ డైరెక్టర్ ప్రీతి సురేఖ ప్రకటించారు.