: మా బ్యాటింగ్ ఘోరం: శ్రీలంక కెప్టెన్ మాధ్యుస్
బ్యాటింగ్ ప్రదర్శన తీవ్ర నిరాశపరచిందని శ్రీలంక జట్టు కెప్టెన్ ఏంజెలో మాథ్యుస్ తెలిపాడు. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ను 2-0తో ఓడిపోయిన అనంతరం మాథ్యూస్ మాట్లాడుతూ, ఆధిక్యం సాధించినా నిలబెట్టుకోలేకపోయామని అన్నాడు. ఆటగాళ్ల ప్రదర్శన తనను తీవ్రంగా నిరాశపరచిందని చెప్పాడు. బౌలర్లు పోరాడాలంటే అందుకు సరిపడా స్కోరు బ్యాట్స్ మన్ చేయాలని అన్నాడు. పేలవ ప్రదర్శన చేసి, బౌలర్ల నుంచి ఫలితాలు కావాలంటే ఎలా? అని ప్రశ్నించాడు. మ్యాచ్ ముగిసిన తీరు తనను ఆవేదనకు గురిచేసిందని మాథ్యూస్ చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ లలో మెరుగ్గా రాణించిన న్యూజిలాండ్ సిరీస్ ను గెలుచుకుందని మాథ్యుస్ తెలిపాడు. కాగా, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సాధించిన శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 133 పరుగులకే ఆలౌటై నిరాశపరిచింది. దీంతో న్యూజిలాండ్ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది.