: ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు!: గంటా
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందిన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయాలన్న కుట్రతోనే ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదించిందనే వాదన ప్రజల్లోకి వెళ్తోందని, అలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. ఇందుకుగాను ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ యూనివర్సీటీలను బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. ఉన్నత విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగానే ప్రైవేటు యూనివర్సిటీలోను దేశంలో మొట్టమొదటి సారిగా ప్రైవేటు యూనివర్సిటీలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.