: కాలుష్య నివారణ విషయంలో మోదీని మాట సాయం కోరిన కేజ్రీవాల్
ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాటసాయం కోరారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో కేజ్రీవాల్ ఏం సాయం కోరారంటే... జనవరి 1 నుంచి వాహన కాలుష్య నియంత్రణకు ఢిల్లీలో సరి, బేసి సంఖ్యల విధానం అమలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని భావించిన కేజ్రీవాల్, ఈ ప్రయత్నంలో పాలుపంచుకునేలా ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేంద్ర మంత్రి వర్గంలోని మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులను ఇందులో పాలుపంచుకునేలా ఆదేశించాలని లేఖ రాశారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న సంగతి తెలిసిందే.