: నిమ్స్ లో టీడీపీ నేత మెట్ల సత్యనారాయణను పరామర్శించిన చంద్రబాబు
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో మాజీ మంత్రి, టీడీపీ నేత మెట్ల సత్యనారాయణను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో ఈరోజు వెళ్లి సీఎం మాట్లాడారు. ఆయనతో పాటు హోంమంత్రి చినరాజప్ప, ఆర్థిక శాఖ మంత్రి యనమల, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయనను పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతును ఆయన ఆరోగ్య పరిస్థితిని నిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం నుంచి మూడు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన మెట్ల, చంద్రబాబు కేబినెట్ లో 1996-99లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు.