: వ్యక్తిగతంగా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోను... టీడీఎల్పీలో చంద్రబాబు
రాజకీయంగా పొరపాటు చేస్తే సరిదిద్దే ప్రయత్నం చేస్తాను, కానీ, వ్యక్తిగతంగా తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం జరిగిన తెలుగుదేశం శాసనసభాపక్ష (టీడీఎల్పీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు అంశాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రులు కూడా ఇతర ఎమ్మెల్యేల నియోజకవర్గాల పనుల్లో వేలు పెట్టవద్దని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తల పనులను మంత్రులు విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడేది లేదన్నారు. జనవరి 2 నుంచి జన్మభూమి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు బాబు తెలిపారు. ప్రతి సోమవారం మంత్రులు, అధికారులు తప్పనిసరిగా అమరావతిలో అందుబాటులో ఉండాలని ఆయన గట్టిగా చెప్పినట్లు సమాచారం.