: ప్రధాని మోదీపై కేటీఆర్ విమర్శలు


భారత ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇంతవరకు హైదరాబాదుకు మోదీ రాలేకపోయారని అన్నారు. దేశంలో తిరగడం మానేసి, విదేశీ పర్యటనల్లో మోదీ బిజీ అయిపోయారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే టీడీపీ, బీజేపీ నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజల కోసం వాళ్లు ఇంతవరకు ఏమి చేశారన్న విషయంపై జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కాసేపు ఆలోచిస్తే మంచిదని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ దే అని చెప్పారు. రంగారెడ్డి డీసీసీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ ఈ రోజు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News