: కరీంనగర్ జిల్లాలో డబుల్ లైన్ రహదారుల విస్తరణకు ప్రభుత్వం అనుమతి
కరీంనగర్ జిల్లాలో డబుల్ లైన్ రహదారుల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపింది. తెగడపల్లి-మేడారం, మహదేవ్ పూర్-ముకునూరు, కంకనూరు-కాటారం మార్గాలను 2 వరుసలుగా మార్చేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రహదారుల విస్తరణకు రూ.30.6కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయనున్నారు.