: ‘బాజీరావు మస్తానీ’ కంటే ముందున్న ‘దిల్ వాలే’!


బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన దిల్ వాలే చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాజీరావు మస్తానీ చిత్రం కలెక్షన్ల కన్నా‘దిల్ వాలే’ దూసుకెళుతోంది. గత శుక్రవారం ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ‘దిల్ వాలే’ మూడు రోజులకు రూ.121 కోట్లు వసూలు చేసింది. భారత్ లో రూ.65.02 కోట్లు, విదేశాల్లో రూ.56 కోట్లు వసూల్ చేసింది. గల్ఫ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రం దిల్ వాలే అని విశ్లేషకుడు కోమల్ నెహతా చెప్పారు. కాగా, బాజీరావు మస్తానీ చిత్రం మన దేశంలో మూడు రోజుల్లో వసూల్ చేసిన కలెక్షన్లు రూ.46.77 కోట్లు. విదేశాల్లో ఏమేరకు ఈ చిత్రం వసూల్ చేసిందో ఇంకా తెలియరాలేదు. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె జంటగా ఈ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News