: ఆ బిల్లును చర్చలేకుండా ఆమోదిస్తే బాగుంటుంది: వెంకయ్యనాయుడు
జువైనల్ జస్టిస్ బిల్లును చర్చ లేకుండా ఆమోదిస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభకు సూచించారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ, జువైనల్ జస్టిస్ అనేది అత్యంత సున్నితమైన అంశమని అన్నారు. దేశం మొత్తం ఈ విషయంపై ఆసక్తిగా గమనిస్తోందని ఆయన చెప్పారు. కనుక దీనిపై చర్చించడం అనవసరమని, ఇతర బిల్లులు పెండింగ్ లో ఉన్నందున, వాటిపై చర్చ జరగాల్సి ఉన్నందున, దీనిని సభ అర్థం చేసుకుని చర్చ లేకుండా బిల్లును ఆమోదించాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన డిప్యూటీ చైర్మన్ కురియన్, ఇది అత్యంత కీలకమైన బిల్లు అని, దీనిపై రేపు చర్చ ఉంటుందని స్పష్టం చేశారు.