: మండలిలో మిథున్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు
శాసనమండలిలో కాల్ మనీ అంశంపై చర్చ సందర్భంగా రాజంపేట వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. రేణిగుంట ఎయిర్ పోర్టు మేనేజర్ పై మిథున్ రెడ్డి దౌర్జన్యం చేశారని, దానిపై కేసు పెడితే అనవసర రాద్ధాంతం చేశారని, రాజీనామా చేస్తానని కూడా అన్నారని... ఆ తర్వాత సీసీ కెమెరా ఫుటేజీ బయటకు వచ్చిందని... దాని తర్వాత మిథున్ రెడ్డి ఇంత వరకు ఒక మాట కూడా మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. వైకాపా నేతలు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. కాల్ మనీ అంశంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని... ఎవరి వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా ఇవ్వాలని కోరుతున్నామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.