: ప్రాజెక్టులపై శాసనసభలో ప్రకటన చేసిన చంద్రబాబు
గత పదేళ్లలో సాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేశారని... డబ్బులు ఖర్చు చేసినా, నీళ్లు మాత్రం ఇవ్వలేక పోయారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇప్పటికే చరిత్రలో తొలిసారి రెండు నదులను అనుసంధానం చేశామని... గాలేరు-నగరి, హంద్రీనీవాల ద్వారా రాయలసీమ నీటి కష్టాలను తీర్చబోతున్నామని చెప్పారు. ఈ రోజు శాసనసభలో ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో మరో 36 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి సాధ్యపడుతుందని తెలిపారు. అన్ని చెరువుల్లో నీటిని ఉంచగలిగితే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని చెప్పారు. పట్టిసీమ ద్వారా గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.