: 2004 నాటి కనిష్ఠానికి ముడి చమురు ధర


చమురు ఉత్పత్తి ఆల్ టైం రికార్డులకు చేరడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 2004 నాటి కనిష్ఠ స్థాయులకు చేరుకుంది. సోమవారం నాటి సెషన్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 2008లో ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిన వేళ నమోదైన ధర కన్నా దిగువకు పడిపోయింది. అంతేకాదు, 2004 స్థాయికి చేరి సరికొత్త 11 ఏళ్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఈ సెషన్ లో క్రితం ముగింపుతో పోలిస్తే, బ్రెంట్ క్రూడాయిల్ ధర 2 శాతం తగ్గి 36.17 డాలర్లకు చేరింది. 2004లో బ్రెంట్ ముడిచమురు కనిష్ఠ ధర 36.20 డాలర్లు కాగా, ఇప్పుడు ఆ స్థాయి కన్నా దిగువకు ధరలు చేరాయి. ఇక యూఎస్ వెస్ట్ టెక్సాల్ ఫ్యూచర్స్ లో క్రూడాయిల్ ధర 24 సెంట్లు తగ్గి 34.49 డాలర్లుగా నమోదైంది. ఇక భారత క్రూడాయిల్ బాస్కెట్ ధర మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 15 రూపాయలు తగ్గి 0.62 శాతం నష్టంతో రూ. 2,387 వద్ద కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News