: ఏపీలో 'అందరూ అమాయకులే'... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న తెలుగు నెటిజన్ల సెటైర్


ఆంధ్రప్రదేశ్ లో గత సంవత్సరం వ్యవధిలో జరిగిన వివిధ సంఘటనలను గురించి ప్రస్తావిస్తూ, 'అందరూ అమాయకులే' అంటూ, తెలుగులో ఫేస్ బుక్ లో ఓ నెటిజన్ పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. * వనజాక్షి కేసులో చింతమనేని ప్రభాకర్ అమాయకుడు. * రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావు అమాయకుడు. * కార్ రేసులో విద్యార్థి మరణిస్తే, బొండా ఉమ పుత్రరత్నాలు కూడా అమాయకులే. * ఓటుకు నోటు కేసులో చంద్రబాబు సహా రేవంత్ రెడ్డి అమాయకులే. * ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 10 లక్షలు తీసుకున్న మంత్రి పీతల సుజాత అమాయకురాలే. * రాజధానిలో పంటపొలాలు తగలబెడితే అధికారులు అమాయకులే. ... ఇంతమంది అమాయకుల మధ్యలో కాల్ మనీ అక్రమాలకు పాల్పడిన నేతలు కూడా అమాయకులు కాకుండా పోతారా? అన్న ప్రశ్న షేరింగ్ మీద షేరింగ్, లైక్ ల మీద లైక్ లతో దూసుకుపోతోంది.

  • Loading...

More Telugu News