: తహశీల్దార్ వనజాక్షి ఘటనపై శాసనమండలిలో చంద్రబాబు స్పందన


కృష్ణా జిల్లాలోని తమ్మిలేరు వాగు ఇసుక రీచ్ వివాదంలో తహశీల్దార్ వనజాక్షి ఘటనపై ఏపీ శాసనమండలిలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వనజాక్షి మండల సరిహద్దు దాటి వెళ్లారన్నారు. తన జిల్లా సరిహద్దు దాటి వెళ్లినందువల్లే ఆమె వివాదంలో చిక్కారని చెప్పారు. అటు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా తన నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలకు మద్దతుగా వెళ్లారని పేర్కొన్నారు. అయితే దాడి ఘటనలో ఎమ్మెల్యే, తహశీల్దార్ ఇద్దరిదీ తప్పేనని చంద్రబాబు తెలిపారు. కానీ ఎమ్మెల్యేలు కూడా వారి సరిహద్దుల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News