: చోటా బచ్చన్ తో కలిసి కోహ్లీని ‘కుమ్మేసిన’ ధోనీ!


నిజమేనండోయ్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా చిచ్చర పిడుగు, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని భారీ దెబ్బ కొట్టాడు. ఇందుకు అతడు బాలీవుడ్ చోటా బచ్చన్ అభిషేక్ బచ్చన్ సాయం తీసుకున్నాడు. వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా, నిన్న గోవా వేదికగా జరిగిన ఐఎస్ఎల్ ఫుట్ బాల్ మ్యాచ్ గురించి తెలిస్తే, విషయం ఇట్టే అర్థమైపోతుంది. గ్రామీణ క్రీడ కబడ్డీకి ప్రాణం పోసిన అభిషేక్ బచ్చన్ అదే తరహాలో ఫుట్ బాల్ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు తెరపైకి తెచ్చిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ నిన్న ముగిసింది. సిరీస్ లో నిన్న గోవాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నయిన్ ఎఫ్సీ, గోవా ఎఫ్సీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. చెన్నయిన్ ను అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేయగా, అందులో ధోనీ వాటా తీసుకుని చెన్నయిన్ సహ యజమానిగా మారాడు. ఇక గోవా జట్టుకు విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉన్నాడు. ఈ రెండు జట్ల మధ్య నిన్న జరిగిన ఫైనల్ తుది దాకా రసవతర్తంగా సాగింది. చివర్లో చెన్నయిన్ స్ట్రైకర్ స్టీవెన్ మెండోసా కళ్లు చెదిరే గోల్ కొట్టడంతో ధోనీ జట్టు విరాట్ జట్టుపై విజయం సాధించింది. అప్పటిదాకా ఇరు జట్లు రెండేసి గోల్స్ చేయగా, చివరి నిమిషంలో మెండోసా గోల్ తో చెన్నయిన్ స్కోరు 3కు చేరగా, గోవా 2 గోల్స్ వద్దే నిలిచింది.

  • Loading...

More Telugu News