: రష్యాను అమెరికా, యూరప్ నమ్మడం లేదు: పుతిన్


ముక్కలైన యూఎస్ఎస్ఆర్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్)ను పునర్నిర్మించే పనిలో రష్యా ఉందనే పుకార్లు అమెరికా, యూరప్ దేశాల్లో ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ పుకార్లపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఘాటుగా స్పందించారు. ఈ రోజు 'పబ్లిక్ రష్యా' ఛానల్ లో పుతిన్ మాట్లాడిన డాక్యుమెంట్ ప్రసారం అయింది. "మేము యూఎస్ఎస్ఆర్ ను పునర్నిర్మించాలని అనుకోవడం లేదు. ప్రతి దేశానికి తమ సొంత సంస్కృతి, వారసత్వాలు ఉంటాయి. దీన్ని రష్యా గుర్తించింది కాబట్టే యూఎస్ఎస్ఆర్ గురించి ఆలోచించడం లేదు. అయితే ఈ నిజాన్ని అమెరికా, యూరప్ దేశాలు నమ్మడం లేదు. మళ్లీ యూఎస్ఎస్ఆర్ ను నిర్మించే పనిలో రష్యా ఉందని వారు భావిస్తున్నారు. తామే గొప్పవాళ్లమని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. తమ అభిప్రాయాలను ఇతర దేశాలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై వారు ప్రదర్శించే ఆసక్తిలో సగమైనా మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలపై కేంద్రీకరిస్తే ప్రపంచ పరిస్థితి ఎంతో మెరుగవుతుంది", అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News