: అయుత చండీయాగానికి అంకురార్పణ... గణపతి హోమాన్ని ప్రారంభించిన కేసీఆర్ దంపతులు


గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగానికి అంకురార్పణ జరిగింది. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్)లో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న అయుత చండీయాగానికి కేసీఆర్ భారీ ఏర్పాట్లు చేయించారు. ఈ నెల 23న ప్రారంభం కానున్న యాగానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం అంకురార్పణ జరిగింది. సతీసమేతంగా యాగ క్షేత్రానికి వచ్చిన కేసీఆర్ గణపతి హోమాన్ని ప్రారంభించారు.

  • Loading...

More Telugu News