: 2002 నాటి మతకల్లోలం రిపీట్ అయ్యేలా ఉంది!: అజాం ఖాన్ హెచ్చరిక


ఇండియాలో 2002 నాటి మతకల్లోలాలు మరోసారి జరిగే ప్రమాదం కనిపిస్తోందని యూపీ మంత్రి ఆజాం ఖాన్ హెచ్చరించారు. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ప్రజల మధ్య అశాంతిని పెంచేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. "2002 నాటి భయానక పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2016లో మూడు రాష్ట్రాల్లో, 2017లో యూపీలో ఎన్నికలు జరగనుండడమే ఇందుకు కారణం. ఆవులను, గంగానదిని చూపుతూ కొందరు మత ఘర్షణలను పెంచాలని చూస్తున్నారు" అని ఆయన ఆరోపించారు. బీజేపీ సర్కారు ఓ వైపు 'బీఫ్'కు వ్యతిరేకంగా మాట్లాడుతూ, పశుమాంసాన్ని ఎగుమతి చేసే సంస్థ నుంచి భారీగా నిధులు స్వీకరించిందని ఆయన ఆరోపించారు. ఆవులను, ఓ గుడిని, గంగా నదిని ప్రస్తావిస్తూ, బీహారులో మద్దతు పొందాలని చూసిన బీజేపీని ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు తిరస్కరించారు. ఇక ఇదే ప్రయత్నం మరోసారి చేయాలని వారు భావిస్తున్నారని ఖాన్ విమర్శించారు. "నేను ఇప్పటికే బీజేపీని హెచ్చరించాను. అధికార పీఠాన్ని వదిలి, నాకు అధికారం ఇవ్వాలని. దేశాన్ని కాపాడే శక్తి మీకు లేకుంటే, నేను వచ్చి రక్షిస్తాను" అని అన్నారు.

  • Loading...

More Telugu News