: 'జబర్దస్త్' షేకింగ్ శేషుకు గాయాలు


తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ షేకింగ్ శేషు గాయాలపాలయ్యాడు. రాజస్థాన్ లో ఓ షూటింగ్ సందర్భంగా అతను గాయపడ్డాడు. షూటింగ్ లో భాగంగా, ఓ ఛేజింగ్ సీన్ ను చిత్రీకరిస్తుండగా, జిప్సీ వాహనం బోల్తాపడి అతను ప్రమాదానికి గురయ్యాడు. దాంతో అతని ఎడమ చేతికి గాయమయింది. ప్రస్తుతం అతను హైదరాబాదులోని అమీర్ పేట, ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

  • Loading...

More Telugu News