: మిస్ యూనివర్స్ గా ఫిలిప్పీన్స్ సుందరి... పోటీలో సత్తా చాటలేకపోయిన ఉర్వశి


మిస్ యూనివర్స్ పోటీలో భారత సుందరి ఉర్వశి రౌతెలా సత్తా చాటలేకపోయింది. నేటి ఉదయం లాస్ వెగాస్ లో ముగిసిన ఈ పోటీల్లో ఫిలిప్పీన్స్ కు చెందిన అందాల భామ పియా అలోంజో వుర్త్జ్ బాచ్ మిస్ యూనివర్స్ గా ఎంపికైంది. ఇక ఫస్ట్ రన్నరప్ గా కొలంబియాకు చెందిన అరియాడ్నా గుటియరెజ్, సెకండ్ రన్నరప్ గా అమెరికాకు చెందిన ఒలివియా జోర్డాన్ ఎంపికైంది. పోటీల్లో భారత్ సత్తా చాటుతుందని భావించిన రౌతెలా రన్నరప్ గానూ నిలవలేకపోయింది. ఉత్తరాఖండ్ చెందిన ఉర్వశీ, మిస్ యూనివర్స్ టైటిల్ ను గెలిచి తీరతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోటీల్లో ఆమె ఫైనల్ కు కూడా చేరలేకపోయింది.

  • Loading...

More Telugu News