: కేసీఆర్ ది 'కల్వకుంట్ల' రాజ్యాంగం: టీటీడీపీ నేత రావుల


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శాసనమండలిలో ఇప్పటికే మెజారిటీ ఉన్నప్పటికీ, కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడటం దారణమని అన్నారు. టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగని ఇతర పార్టీల నేతలను బెదిరిస్తున్నారని, మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో టీఆర్ఎస్ కు కేవలం 4 ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ... ఏకంగా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ లో చేరకపోతే ప్రాణాలు తీస్తామంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్నది భారత రాజ్యాంగం కాదని... కల్వకుంట్ల రాజ్యాంగం అని అన్నారు.

  • Loading...

More Telugu News