: ఇక వాగ్వాదం లేదు!.. ఏకంగా సమావేశాలనే బాయ్ కాట్ చేసిన వైసీపీ
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గడచిన రెండు రోజుల సమావేశాల్లో నెలకొన్న వాగ్వాదం మిగిలిన మూడు రోజుల్లో కనిపించదు. ఎందుకంటే, ప్రతిపక్ష వైసీపీ ఏకంగా శీతాకాల సమావేశాలనే బాయ్ కాట్ చేసేసింది. తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ కు నిరసనగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సభ శీతాకాల సమావేశాలను పూర్తిగా బాయ్ కాట్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అంతేకాక స్పీకర్ వారిస్తున్నా వినకుండా ఆయన తన పార్టీ సభ్యులతో కలిసి విసవిసా బయటకు వెళ్లిపోయారు. దీంతో మిగిలిన మూడు రోజుల సమావేశాల్లో ఎలాంటి వాగ్వాదం కనిపించదు. అధికార పక్షం ప్రతిపాదించనున్న బిల్లులు కూడా ఎలాంటి అవరోధం లేకుండానే పాస్ కానున్నాయి.