: న్యాయం కోసం రోడ్డెక్కిన నిర్భయ తల్లి... ఇండియా గేటు వద్ద ఆందోళనలో గాయాలు


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'నిర్భయ' ఘటనలో మూడేళ్లుగా జువైనల్ హోమ్ లో వున్న బాల నేరస్తుడు నిన్న విడుదలయ్యాడు. దీనిపై భగ్గుమన్న నిర్భయ తల్లిదండ్రులు న్యాయం కోసం రోడ్డెక్కారు. తన కూతురుపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన నిందితుడిని మైనారిటీ తీరలేదన్న కారణంగా ఎలా విడుదల చేస్తారంటూ నిర్భయ తల్లి ఆశాదేవీ ప్రభుత్వాన్ని ఘాటునే ప్రశ్నించారు. అంతేకాక నిందితుడు విడుదలైన నేపథ్యంలో ఆశాదేవీ మరికొంత మందితో కలిసి ఢిల్లీలో నిరసనకు దిగింది. ఇండియా గేటు ముందు నిరసన ప్రదర్శన చేపట్టిన ఆశాదేవీ సహా మిగతా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దోషిగా తేలిన వ్యక్తిని విడుదల చేసిన ప్రభుత్వం, న్యాయం చేయాలన్న తమను అడ్డుకోవడం దారుణమని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News