: గెలుపు సంబరాల్లో ఓవర్ చేసిన 'చెన్నయిన్ ఎఫ్.సి' కెప్టెన్... అరెస్ట్ చేసిన గోవా పోలీసులు
నిన్న గోవాలో ఉత్కంఠభరితంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ లో చెన్నయిన్ ఎఫ్సీ జట్టు, గోవా జట్టుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా గోవాలోని మార్గోవా స్టేడియంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో భాగంగా చెన్నయిన్ కెప్టెన్ ఎలానో బ్లూమర్ కట్టు తప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియంలో జరిగిన సంబరాల్లో భాగంగా ఎలానో ప్రత్యర్థి జట్టు సభ్యులను ఆట పట్టించాడు. దీనిని గమనించిన గోవా జట్టు సహ యజమాని దత్తరాజ్ సల్గావోన్కర్ అభ్యంతరం చెప్పారట. దీంతో దత్తరాజ్ పై ఎలానో దాడికి దిగాడు. దీనిపై దత్తరాజ్ మార్గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎలానోను అరెస్ట్ చేసినట్లు మార్గోవా పోలీస్ ఇన్ స్పెక్టర్ సీఎల్ పాటిల్ చెప్పారు.