: రంగనాథ్ ని మొట్టమొదటిసారి టికెట్టు కలెక్టర్ గా చూశాను: సినీనటి శారద


రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నారనే వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని సీనియర్ నటి శారద ఆవేదన వ్యక్తం చేశారు. రంగనాథ్ తో పరిచయంలేని వాళ్లు కూడా ఆయన్ని ఇష్టపడతారని, ఆయన అంత మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘ఎదుటివారిని ఎప్పుడూ నొప్పించరు. వ్యక్తిగతంగా చాలా మంచివాడు. రంగనాథ్ తన భార్యకు చేసినటువంటి సేవ బహుశ ప్రపంచంలో ఏ భర్త చేసి ఉండడు. ప్రపంచంలో అంత గొప్ప భర్త ఎక్కడా ఉండరు. మొట్టమొదటి సారిగా, ఆయన్ని టికెట్టు కలెక్టర్ గా రైలులో చూశాను. ఆ తర్వాత ఆయన, నేను కలిసి హీరో హీరోయిన్లుగా నటించాం. రంగనాథ్ మంచి రైటర్. ఆయన కుటుంబసభ్యులతో కూడా నాకు చాలా అనుబంధం వుంది’ అని శారద చెప్పారు.

  • Loading...

More Telugu News