: ఫిలిం చాంబర్ లో రంగనాథ్ భౌతిక కాయానికి పలువురు ప్రముఖుల నివాళులు
ప్రముఖ సీనియర్ నటుడు రంగనాథ్ భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టమ్ పూర్తయిన అనంతరం ఆయన భౌతిక కాయాన్ని ఇక్కడికి తరలించారు. పలువురు సినీ ప్రముఖులు అక్కడికి వెళ్లి నివాళులర్పించారు. మురళీమోహన్, జమున, రాజేంద్రప్రసాద్, గిరిబాబు, శివాజీ రాజా, శివకృష్ణ, ఏడిద శ్రీరాం, తెలంగాణ మంత్రి తలసాని తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.