: రాష్ట్రపతిని కలిసిన జగన్... పలు విషయాలపై ప్రస్తావన
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం వైఎస్సార్సీపీ సీనియర్ నేతలతో కలిసి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ను కలిశారు. మహిళల జీవితాలతో ఆడుకున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసు, ఏపీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం, ఏపీ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైయిజరీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయాలపై ప్రణబ్ తో జగన్ ప్రస్తావించినట్లు సమాచారం.