: డ్యాన్స్ మాస్టర్ భరత్ ఆత్మహత్య
పలు టీవీ షోల్లో డ్యాన్స్ మాస్టర్ గా రాణించి, బుల్లితెర ప్రేక్షకుల్లో తనదైన స్థానాన్ని పొందిన భరత్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్, ఎర్రగడ్డ సమీపంలోని మోతీనగర్ లో ఉన్న తన నివాసంలో ఈ ఉదయం భరత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. భరత్ ఆత్మహత్యకు గల కారణాలేమిటో తెలియరాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు వివరించారు. కాగా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వంటి పలు టీవీ షోల్లో భరత్ పాల్గొని వివిధ బహుమతులు గెలుచుకున్నాడు.