: 'అమ్మ' ఫోటో లేదని ఆర్బీఐపై అలిగెళ్లిన మంత్రి!


తిరుచ్చిలో ఓ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన తమిళ సమాచార శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ అలిగి వెళ్లిపోయారు. ఆయన ఎందుకు అలిగారో తెలుసుకున్న అధికారులు అవాక్కవాల్సిన పరిస్థితి. ఇంతకీ విషయం ఏంటంటే, ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన రాజేంద్ర, వరుసగా ఒక్కో స్టాల్ నూ ప్రారంభిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆర్బీఐ స్టాల్ వద్దకు రాగానే ఆయనకు కోపం వచ్చింది. దాని రిబ్బన్ కట్ చేయకుండానే వెళ్లిపోయారు. అధికారులు ఆరా తీస్తే, ఆర్బీఐ స్టాల్ లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చిత్రం లేదన్న కారణంగానే సదరు మంత్రి అలిగారని తెలిసింది. ఓ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ కాబట్టే జయలలిత చిత్రాన్ని పెట్టలేదని ఆర్బీఐ అధికారులు వెల్లడించగా, చివరికి ఆ స్టాల్ ను కలెక్టర్ ప్రారంభించి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News