: పట్టాలు తప్పిన ఆమ్రపాలి ఎక్స్ ప్రెస్
కొద్ది సేపటి క్రితం బీహార్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగింది. కతిహార్, అమృతసర్ ల మధ్య నడిచే ఆమ్రపాలి ఎక్స్ ప్రెస్ (15707) పట్టాలు తప్పింది. ఖగారియా సమీపంలోని పస్రాహా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురికాగా, ఐదు స్లీపర్, రెండు ఏసీ బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలైనట్టు సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే శాఖ అధికారులు సహాయ చర్యల కోసం మరో రైలును పంపారు. ప్రమాదంతో ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు ప్రమాదంపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.