: ఆ ముగ్గురు దేవుళ్లు దిగివచ్చినా, ఆ బిల్లు పాస్ కాదు: ఆనంద్ శర్మ


త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దిగివచ్చినా ప్రతిపాదిత జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ - వస్తు సేవల పన్ను) బిల్లు ఆమోదం పొందబోదని మాజీ వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి బిల్లును అమలు చేయాలని చూస్తున్నారని, అది అసంభవమని ఆయన అన్నారు. ఇండస్ట్రీ బాడీ ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆనంద్ శర్మ ప్రసంగిస్తూ, ఈ విషయంలో ప్రధాని, విపక్ష నేత ఒకే మాటపై నిలిచినా, బిల్లు ఆమోదం సంభవం కాదని అభిప్రాయపడ్డారు. స్టేట్ జీఎస్టీ, సెంటర్ జీఎస్టీ, ఐజీఎస్టీ (ఇంటర్ స్టేట్ జీఎస్టీ) పన్నులపై ఇంకా సగం రాష్ట్రాల నుంచి ధ్రువీకరణ రావాల్సి వుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న జీఎస్టీకి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించడం లేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించకుండా జీఎస్టీపై కేంద్రం ముందుకు వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News