: ఇండియాలో అతి తక్కువ ధరలో విడుదలైన విండోస్ 10 సరికొత్త ఫోన్ ఇదే!


గత వారం యూరప్ మార్కెట్లో విడుదలైన మైక్రోసాఫ్ట్ లూమియా 550, ఇండియాలోకీ ప్రవేశించింది. విండోస్ 10 సిరీస్ లో అతి తక్కువ ధరకు లభ్యమవుతున్న ఫోన్ ఇదే కావడం గమనార్హం. ఇండియాలో దీని ధర రూ. 9,399 రూపాయలని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. విండోస్ 10 హైఎండ్ ఫోన్లలో ఉన్న ఫీచర్లన్నీ ఇందులో కూడా ఉన్నాయని వెల్లడించింది. ఎడ్జ్ బ్రౌజర్, ఔట్ లుక్ మెయిల్, వన్ డ్రైవ్, ఎంఎస్ ఆఫీస్, డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ తదితరాలు ఉన్నాయని పేర్కొంది. 4.7 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 1.1 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ రామ్, 8 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ 4జీ తరంగాలకు మద్దతు ఇస్తుందని సంస్థ పేర్కొంది. లైట్ సెన్సార్, 150 ఎంబీపీఎస్ వరకూ డౌన్ లోడ్ స్పీడ్ దీని ప్రత్యేకతలని వెల్లడించింది.

  • Loading...

More Telugu News