: గాంధీలనే కోర్టు హాలులో నిలబెట్టా... ఇదే నా విజయం!: సుబ్రహ్మణ్య స్వామి
"సోనియా, రాహుల్ గాంధీలను సామాన్యుల మాదిరిగా కోర్టు హాలులో నిలబెట్టాను. ఇదే నా విజయం. ఈ పనిని గతంలో ఎవరూ చేయలేకపోయారు. చట్టం ముందు ప్రతిఒక్కరూ సమానమేనని మరోసారి తేలింది" అని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టుకు హాజరైన సోనియా, రాహుల్ లు బెయిల్ పొంది వెళ్లిపోయిన తరువాత, ఓ టెలివిజన్ చానల్ తో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడారు. ఈ ఘటనతో తాము చట్టానికి అతీతులమని భావిస్తున్న వారి కలలు పటాపంచలు అయ్యాయని స్వామి అన్నారు. కాగా ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు మిగతా నిందితులూ బెయిల్ పొందిన సంగతి తెలిసిందే.