: ఆసీస్ పర్యటనలో టీమిండియా టీట్వంటీ, వన్డే జట్ల ఆటగాళ్లు వీరే
వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఆటగాళ్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వన్డే, టీట్వంటీ జట్లలో పలు మార్పులు చేశారు. వన్డే జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, మనీష్ పాండే, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, అక్షర పటేల్, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, గురుకీరత్ సింగ్, రిషి ధవన్, బ్రయిందర్ సింగ్ శ్రాన్ చోటు సంపాదించుకున్నారు. టీట్వంటీ జట్టు వివరాల్లోకి వెళ్తే... కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, హర్భజన్ సింగ్, ఉమేష్ యాదవ్, హార్థిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రాలను ఎంపిక చేశారు. జట్టు ఎంపిక సందర్భంగా సురేష్ రైనాను పరిగణనలోకి తీసుకోలేదని మొదట వార్తలు వెలువడగా, వన్డే జట్టు నుంచి రైనాను తొలగించిన సెలెక్టర్లు, చివరికి టీట్వంటీల్లో చోటు కల్పించడం విశేషం.