: 653 బౌండరీలు, 600 సిక్సర్లు బాదిన గేల్


వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ అరుదైన ఫీట్ సాధించాడు. క్రీజులో దిగినప్పటి నుంచి మైదానం నాలుగు పక్కలకు బంతిని ఎడాపెడా బాదేసే గేల్ టీట్వంటీల్లో 600 సిక్సర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు 45 అంతర్జాతీయ టీట్వంటీ మ్యాచ్ లు ఆడిన గేల్ 87 సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ వంటి టోర్నీలలో 227 మ్యాచ్ లు ఆడిన గేల్ 600 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఎక్కువ సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీల్లో గేల్ ఫోర్ల సంఖ్య సిక్సర్లను మించిపోయింది. 653 ఫోర్లు బాదిన గేల్ బౌండరీల్లోనూ తనకు తిరుగులేదని చాటుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News