: రేపు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం


ప్రఖ్యాత నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వరరావు అంతర్జాతీయ పురస్కారాలను రేపు హైదరాబాద్ లో ప్రదానం చేయనున్నారు. 'అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ గతేడాది నుంచి నవరత్నాలు పేరుతో ఈ పురస్కారాలను ఇస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లోని తొమ్మిది మంది ప్రతిభావంతులను సత్కరించబోతున్నారు. అందులో సీనియర్ సినీ నటుడు కృష్ణకు జీవన సాఫల్య పురస్కారం అందించనున్నారు. విశిష్ట వ్యాపారరత్నగా ఏవిఆర్ చౌదరిని, సినీరత్నగా కైకాల సత్యనారాయణను, రంగస్థల రత్నగా కర్నాటి లక్ష్మీ నరసయ్యను, విద్యారత్నగా చుక్కా రామయ్యను, వైద్యరత్నగా డాక్టర్ గుళ్ల సూర్యప్రకాశ్ ను, సేవారత్నగా డాక్టర్ సునీతా కృష్ణన్ ను, యువరత్నగా కుమారి పూర్ణ మాలవత్ ను, చేనేత కళారత్నగా నల్లా విజయ్ ను సత్కరిస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News