: అధికార పార్టీ మమ్మల్ని లక్ష్యం చేసుకుంది...అయినా బెదిరేది లేదు: సోనియా గాంధీ
కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోని కొంత మంది వ్యక్తులు తమపై బురదజల్లాలని చూశారని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ తెలిపారు. పటియాలా హౌస్ కోర్టులో విచారణకు హాజరైన అనంతరం సోనియా గాంధీ మాట్లాడుతూ, చట్టాలను గౌరవించే తాము న్యాయస్థానానికి హాజరయ్యామని అన్నారు. చట్టం దృష్టిలో అంతా సమానమేనని, తమకు న్యాయం జరుగుతుందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉందని, సిద్ధాంతాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ఆమె పేర్కొన్నారు. కోర్టులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపిన ఆమె, విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయని స్పష్టం చేశారు. అధికార పార్టీ తమను లక్ష్యం చేసుకుందని ఆరోపించిన ఆమె, తాము బెదిరేది లేదని, పోరాడుతామని తెలిపారు.