: వైద్య సేవలకు కేంద్రంగా అమరావతి: చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రానున్న రోజుల్లో వైద్య సేవలకు కేంద్రంగా మారబోతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేసిన అనంతరం... అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలోనే ఎయిమ్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఏపీని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. పేదవారి ఆరోగ్య సంరక్షణే తమ ప్రథమ లక్ష్యమని చెప్పారు. నిపుణులైన వైద్యులు ఇక్కడ ఉండటం ఏపీకి లాభించే విషయమని అన్నారు. అంగన్ వాడీల జీతాలను పెంచాలని నిర్ణయించామని... దీనివల్ల ప్రభుత్వానికి రూ. 311 కోట్ల అదనపు భారం పడనుందని చెప్పారు.