: రోజమ్మ కోలుకుంటోంది: జగన్


తమ ఎమ్మెల్యే రోజమ్మ ఆరోగ్యం కుదుటపడుతోందని వైకాపా అధినేత జగన్ చెప్పారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో రోజాను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. రోజమ్మను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమె బీపీ 180/100గా ఉందని డాక్టర్లు చెప్పారని జగన్ తెలిపారు. హైబీపీతో బాధపడుతున్న ఆమెకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. గతంలో కూడా 9 రోజుల పాటు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో రోజా అడ్మిట్ అయ్యారని తెలిపారు. శాసనసభలో ఉన్న సగం మంది బీజేపీ సభ్యులు టీడీపీ కండువా కప్పుకున్నారని విమర్శించారు. తమకు నచ్చని వాళ్లపై ఏడాది పాటు నిషేధం విధిస్తే, శాసనసభ మీద ప్రజలకు ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పారు. తమకు బలం ఉంటే స్పీకర్ పై అవిశ్వాసం పెట్టేవాళ్లమని జగన్ తెలిపారు. 'మా ఖర్మ ఏమిటంటే... అవిశ్వాసం పెట్టినా అది నిలబడదు... అందుకే ఊరుకున్నాం' అని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News