: వైద్య రంగంలో అన్ని సంస్కరణలను ఏపీ నుంచే ప్రారంభిస్తాం: కేంద్ర మంత్రి జేపీ నద్దా


గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా... రాష్ట్రానికి మరిన్ని హామీలిచ్చారు. దేశంలో కేన్సర్ పై రెండు అధునాతన వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. త్వరలో ఏపీలో కేన్సర్ నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. ఇక వైద్య రంగంలో కేంద్రం చేపట్టే అన్ని సంస్కరణలను ఏపీ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. ఆరోగ్య సేవలు ఢిల్లీ లాంటి పెద్ద నగరాలకే కాకుండా అన్ని చోట్ల అవసరముందన్న మంత్రి, దేశ వ్యాప్తంగా ఆరోగ్య సేవల విస్తరణకు 18 నెలల కాలంలో 10 ఎయిమ్స్ ల స్థాపనకు చర్యలు తీసుకున్నామని వివరించారు. మంగళగిరిలో ఎయిమ్స్ ను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News